నయనతార మెచ్చిన ‘నెయ్యన్నం’ రెసిపీ

వండిన అన్నం - ఒక కప్పు
నెయ్యి - నాలుగు స్పూన్లు
జీడిపప్పులు - ఆరు
నీళ్లు - తగినన్ని
ఉల్లిపాయ - ఒకటి

దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - నాలుగు
యాలకులు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
కుంకుమ పువ్వు రేకలు -నాలుగు

కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

మిగిలిన నెయ్యిలో దాల్చిన చెక్కలు, యాలకులు, లవంగాలు వేయించాలి.

సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.

అందులో వండిన అన్నం, ఉప్పు వేసి పొడిపొడిగా కలుపుకోవాలి.

కుంకుమ పువ్వు రేకలను కాస్త నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లలో అన్నంపై చల్లుకోవాలి.

స్టవ్ కట్టేసి వేయించుకున్న జీడి పప్పులను పైన చల్లుకోవాలి. టేస్టీ నెయ్యన్నం రెడీ అయినట్టే.