వేడి ఆహారంపై నిమ్మరసాన్ని పిండొచ్చా?

చాలా వంటల్లో మనం నిమ్మకాయను భాగం చేసుకుంటాం.

కానీ వేడి ఆహారంపై నిమ్మకాయను పిండొద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

నిమ్మకాయ అనేది విటమిన్ సితో నిండి ఉంటుంది. వేడి ఆహారంపై వేయడం విటమిన్ సిలోని గుణాలన్నీ నాశనం అయిపోతాయి.

విటమిన్ సిను ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. ఇది ఉష్ణోగ్రత, కాంతి... రెండింటికీ స్పందిస్తుంది.

నిమ్మరసం అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు సహజగుణాలను కోల్పోతుంది.

వేడి నీటిలో లేదా వేడి ఆహారంలో ఈ రసం కలవగానే దాని ఎంజైమ్‌లు నాశనం అయిపోతాయి.

నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఉత్తమ మొక్కల సమ్మేళనాలు.

వీటికి వేడి తగిలితే అవి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వవు.