ఈ థాలీ పూర్తిగా తింటే రూ8.5 లక్షల ప్రైజ్ మనీ

ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ భారీ ఆఫర్ ప్రకటించింది.

ఆ భారీ థాలీని 40 నిమిషాల్లో పూర్తి చేస్తే ఎనిమిదన్నర లక్షల రూపాయలు సొంతం చేసుకోవచ్చు.

ఈ భారీ థాలీలో 56 రకాల వంటలు ఉంటాయి. అందులో 20 రకాలు కూరలే ఉంటాయి.

బిర్యానీలు, చపాతీ, రోటీ, డిజర్ట్ లు ఉంటాయి.

ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్లకి ఎనిమిదన్నర లక్షల నగదు లభిస్తుంది.

అలాగే ఇద్దరికి కేదార్ నాథ్‌ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తారు.

ఇంతకుముందు కూడా చాలా రెస్టారెంట్లు ఇలాంటి పోటీలను నిర్వహించాయి.