రోజుకో కప్పు కాఫీ తాగితే దీర్ఘాయుష్షు రోజుకో కప్పు కాఫీ తాగేవారికి శుభవార్త. అనారోగ్యాల బారిన పడి అకాల మరణం పొందే అవకాశాన్ని కప్పు కాఫీ తగ్గిస్తుంది. అధ్యయనంలో కాఫీ తాగని వారితో పోలిస్తే... తాగే వారు అకాల మరణం బారిన పడే అవకాశం 16 నుంచి 21 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాస్త చక్కెర కలుపుకుని తాగే పెద్దవారిలో అకాల మరణం 29 నుంచి 31 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాఫీ మంచిదే అని అధ్యయనాలు చెప్పాయి కాబట్టి రోజూ అయిదారు కప్పులు లాగించేద్దాం అనుకుంటే పొరపాటే. ఒంట్లో కెఫీన్ అధికంగా చేరి కొత్త ఆరోగ్య సమ్యలు పుట్టుకొస్తాయి. రోజుకి గరిష్టంగా రెండు కప్పులతో సరిపెట్టుకుంటే చాలు. ఉత్తమ ఫలితాలు పొందుతారు. అతిగా తాగితే కేలరీలు కూడా అధికంగా చేరుతాయి.