వాడిన వంటనూనె మళ్లీ మళ్లీ వాడితే ఎంత డేంజరో తెలుసా? పకోడీలు, బజ్జీలు చేసుకున్నాక ఆ నూనె మిగులుతుంది. ఆ నూనెను మళ్లీ ఉపయోగించి కూరలు వండుతారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన సమస్యలు వస్తాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద కాగిన నూనె చాలా మార్పులకు లోనవుతుంది. దానిని మళ్లీ వండి తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయి. నూనెను మళ్లీ మళ్లీ అధిక ఉష్ణోగ్రతలకు గురి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. ఇవి గుండెకు చాలా ప్రమాదకరమైనవి. ఈ నూనె వాయురహితంగా మారడంతో పాటూ క్లోస్ట్రియం బోటులినమ్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. వాడిన వంటనూనెతో చేసిన వంటలు చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్, బ్యాక్టిరియా పెరిగిపోతుంది. గుండెల్లో మంట, అజీర్తి, ఆసిడిటీ అధికమవుతాయి. కాబట్టి నూనెను ఒకసారి అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేశాక, మళ్లీ వాడకూడదు.