మోడల్స్ జీతాలు ఎంతుంటాయంటే... చాలా మందికి మోడలింగ్ రంగంలో ఉన్న వారి జీతాలు తెలియదు. మోడల్స్ తో ఏదైనా బ్రాండ్ ఏడాది అగ్రిమెంట్ చేసుకుంటుంది. బ్రాండ్ వాళ్లు ఏడాదికి పురుష మోడల్‌కు రూ.30 లక్షల రూపాయలు ఇస్తే, మహిళా మోడల్‌కు రూ.40 లక్షల దాకా చెల్లిస్తుంది. ఇక వాణిజ్య ప్రకటనలు, డిజైనర్ షూట్లలో పాల్గొంటే నెలకు రెండు నుంచి రెండున్నర లక్షల దాకా పురుష మోడల్స్ సంపాదిస్తారు. అదే మహిళా మోడల్స్‌లైతే మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు. ఒక్కో ఫోటో షూట్‌కు 30 నుంచి 35 వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు మోడల్స్. ఇక ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసినందుకు పురుష మోడల్స్ రూ.7000 నుంచి రూ.10000 వరకు ఛార్జ్ చేస్తారు. అదే మహిళా మోడల్స్ అయితే క్యాట్ వాక్ చేసినందుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఛార్జ్ చేస్తారు.