శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. అది ఒక్కోసారి తీవ్ర పరిస్థితులు కలిగిస్తుంది. అందుకే రోజుకి కనీసం 8 గ్లాసు నీటిని తాగాలి. తగినంత నీరు తీసుకోకపోతే డీహైడ్రేషన్ బారిన పడినట్టే. చర్మం పేలవంగా, పొరలు పొరలుగా కనిపిస్తే శరీరంలో తగినంత నీరు లేదని అర్థం. పెదవులు ఎండిపోయి పగిలిపోయినట్టు కనిపిస్తాయి. శరీరంలోని గాయాలు త్వరగా నయం కావు. గాయాల నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. నిర్జలీకరణం చర్మాన్ని చికాకు పెడుతుంది. దురదగా చర్మం ఎర్రగా మారిపోతుంది. పుచ్చకాయ, దోసకాయ, నారింజ, పాలకూర వంటి నీరు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తినండి. తేమను లాక్ చేయడానికి హైలురోనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి UV రేడియేషన్ నుండి మీ చర్మాన్ని రక్షించడానికి ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను రాసుకోవాలి. కెఫీన్ వాడకం తగ్గించాలి.