కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవాలి. రోజు మొత్తం మీద నాలుగు సార్లు చిన్న మొత్తంలో భోజనం చేయడం మంచిది. స్పైసీ ఫుడ్, టీ, కాఫీ వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి కార్బొనేటెడ్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి యాసిడ్ రిఫ్లక్స్ ని మరింత పెంచుతాయి. తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం మూడు గంటల ముందు తినాలి వేగంగా కాకుండా చిన్నగా నడవడం మంచిది. కఠినమైన వ్యాయామాలు అసలు చేయకూడదు ధూమపానం అలవాటు మానుకుంటే మంచిది అవసరమనిపిస్తే బరువు తగ్గాలి తల పాదాల కంటే ఆరు నుంచి ఎనిమిది అంగుళాల ఎత్తులో ఉండాలి. అప్పుడే గ్యాస్ సమస్య ఉండదు కొన్ని రకాల మందుల వల్ల కూడా కడుపులో యాసిడ్ ఫామ్ అవుతుంది. వాటిని వినియోగించడం తగ్గించడం మంచిది.