కొవ్వు కరిగించి బరువు తగ్గేందుకు ఏవేవో ప్రయత్నాలు చేసి విసిగిపోయారా?
అయితే ఈ లీన్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది.


లీన్ ప్రోటీన్ అంటే సంతృప్త కొవ్వులో తక్కువగా ఉండే ప్రోటీన్. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.



ఇది బరువు తగ్గేందుకు మాత్రమే కాదు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది.
లీన్ ప్రోటీన్ దొరికే కొన్ని ఆహారాల జాబితా ఇదే..


ప్రోటీన్ పుష్కలంగా లభించే పదార్థాలలో గుడ్డు మొదటిది. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.



ప్రోటీన్ రిచ్ పెరుగును అల్పాహారంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఒక కప్పు పెరుగులో 15-20 గ్రాముల ప్రోటీన్ అందుతుంది.



లీన్ ప్రోటీన్ లభించే మరొక అద్భుతమైన పదార్థం చికెన్.



బరువు తగ్గడానికి స్కిన్ లెస్, బోన్ లెస్, చికెన్ బ్రెస్ట్ తినడం ఉత్తమమైన ఎంపిక.
వేయించిన లేదా ప్రాసెస్ చేసిన చికెన్ మాత్రం దూరం పెట్టండి.


సాల్మన్ వంటి కొవ్వు చేపలు శరీరానికి అవసరమైన ప్రోటీన్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులని ఇస్తాయి.



రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా బరువు తగ్గేందుకు దోహదపడతాయి.