మాన్ సూన్ సీజన్ లో నెయ్యి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Image Credit: Wikipedia/Ghee ఈ సీజన్ లో ఎక్కువగా ఫ్లూ, జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి, డయేరియా వంటి వ్యాధుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలతో కూడిన నెయ్యి చేర్చడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలు లేదా జీర్ణవ్యవస్థలో మంటను కలిగించే అనేక కడుపు సమస్యలు ఇబ్బంది పెడతాయి. నెయ్యిని చేర్చడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. శక్తిని ఉత్పత్తి చేసేందుకు కొవ్వు కణజాలాలు కాల్చివేసేందుకు దోహదపడుతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. నెయ్యి మెదడుకి మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నెయ్యి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది చర్మానికి సహజమైన మెరుపుని అందిస్తుంది. డార్క్ స్పాట్ ని తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.