కొరియన్ బ్యూటీ చిట్కా 'జామ్సు టెక్నిక్' తో మీరు మరింత అందంగా మారిపోవచ్చు. జామ్సు అనేది కొరియన్ పదం. దీని అర్థం మునిగిపోవడం. ఈ టెక్నిక్ లో భాగంగా నీటిలో మొహాన్ని ముంచుతారు. తేమతో కూడిన వాతావరణానికి చక్కగా సరిపోతుంది. మీ మేకప్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. ఒక బౌల్ లో ఐస్ ముక్కలు వేసుకుని అందులో 10-5 సెకన్ల పాటు మొహాన్ని ముంచాలి. తర్వాత టవల్ తో తుడుచుకోవాలి. మేకప్ వేసుకున్న తర్వాత మీ ముఖాన్ని ఈ నీటిలో ఉంచాలి. ఫౌండేషన్, కన్సీలర్ వేసుకోవడానికి ముందు మొహం తేమగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీది పొడి చర్మం అయితే ముఖాన్ని నీటిలో ఉంచే సమయం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఐస్ వాటర్ డ్రై స్కిన్ ను హైడ్రేట్ చేస్తుంది. చల్లని నీళ్ళు రంధ్రాలని మూసివేయడం వల్ల మొటిమలు నయం అవుతాయి. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ బ్యూటీ సీక్రెట్ కూడా ఇదే. కొన్ని నెలల క్రితం ఐస్ వాటర్ లో ముఖాన్ని ముంచుతున్న వీడియో పోస్ట్ చేసింది. Images Credit: Pexels/ Instagram