ఈ జ్యూస్‌తో రెండు వారాల్లో చర్మం మెరిసిపోతుంది



రెండు వారాల్లో మీ చర్మాన్ని మెరిసేలా చేసే ఒక జ్యూస్ ఉంది. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకొని ప్రతి రోజూ తాగితే చాలు.



రెండు వారాల్లో మీకు మెరిసే చర్మం సొంతమవుతుంది. దీని తయారు చేయడం చాలా సులువు.



దోసకాయను తీసుకొని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.



పుదీనా ఆకులను కూడా తీసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు, అర స్పూను జీలకర్ర పొడి, నిమ్మరసం, నీరు రెడీగా ఉంచుకోవాలి.



ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి జ్యూస్‌లా చేసుకోవాలి. వాటిని పరగడుపున తాగేయాలి.



ఇలా మీరు రెండు వారాలు చేస్తే చాలు, మీ చర్మం కాంతివంతంగా మారిపోతుంది.



దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.



దీనిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది.