ఈ ఉద్యోగాలు చేస్తే అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం



ప్రపంచంలో ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ కాన్సర్ వంటి వాటి బారిన పడుతున్నారు.



ఎంతోమంది అండాశయ క్యాన్సర్ బారిన కూడా పడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.



ఒక పరిశోధన ప్రకారం కొన్ని ఉద్యోగాలు చేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన అధికంగా పడుతున్నట్టు గుర్తించారు.



హెయిర్ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లు, అకౌంటట్లుగా పనిచేసే మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం అధికంగా ఉంది.



అలాగే దుస్తులు తయారీ పరిశ్రమలలో పని చేసేవారు కూడా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువే.



వీరంతా టాల్కమ్ పౌడర్, అమోనియా, పెట్రోల్, బ్లీచ్ వంటి ఏజెంట్లతో అధికంగా పనిచేయాల్సిన ఇస్తుంది.



అందుకే వీరు ఈ క్యాన్సర్ బారిన అధికంగా పడే అవకాశం ఉన్నట్టు పరిశోధన చెబుతుంది.



కాబట్టి ఆ ఉద్యోగాలు చేసే మహిళలంతా జాగ్రత్తగా ఉండాలి.