రోగనిర్ధారణ పరీక్షల్లో లాలీపాప్స్?



లాలీపాప్‌ను శాంపిల్ సేకరణలో, రోగనిర్ధారణ ప్రక్రియలలో భాగం చేయవచ్చని చెబుతోంది ఒక అధ్యయనం.



లాలీపాప్ లాలాజలం‌లోని బ్యాక్టీరియాను సంగ్రహించగలదని, దాని సాయంతో లాలాజల శాంపిల్‌ను సేకరించి పరీక్షలు చేయవచ్చని చెబుతున్నారు.



కోవిడ్ 19 సమయంలో సలైవాను సేకరించి పరీక్షలు చేశారు. అలా సలైవా సేకరించేందుకు లాలీపాప్ సాయం తీసుకోవచ్చని చెబుతోంది అధ్యయనం.



అవసరమైన మొత్తంలో లాలాజలాన్ని సేకరించడానికి లాలీపాప్స్ ఉపయోగపడతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.



గతంలో లాలీపాప్ ఆకారంలో ఉండే పరికరాలు ఉండేవి. వాటిని క్యాండీ కలెక్టివ్ అని పిలిచేవారు. వాటితో లాలాజలాన్ని సేకరించేవారు.



లాలీపాప్ తినేటప్పుడు లాలాజలం సులభంగా దానికి అధిక స్థాయిలో అంటుతుంది.



నోట్లో ఉన్న బ్యాక్టీరియాలు కూడా అంటుతాయి. ఆ లాలీపాప్‌ను ల్యాబ్లో పరీక్షిస్తే ఆ బాక్టీరియా వల్ల కలిగిన అనారోగ్యాలను కనిపెట్టవచ్చు.



లాలీపాప్స్‌ను తొలిసారి 1908లో తయారు చేశారు.