డయాబెటిస్ రోగుల కోసం పనస పిండి



బియ్యం, గోధుమ పిండి కన్నా డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది ‘పనస పిండి’.



ఇది డయాబెటిస్ ఫ్రెండ్లీ ఆహారం. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ.



దీనిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను నెమ్మదించేలా చేస్తాయి.



ఈ పనస పిండిని తొలిసారి కేరళకు చెందిన జేమ్స్ జోసెఫ్ తయారు చేశారు.అతనే దీన్ని పేటెంట్‌ను పొందారు.



మధుమేహంతో జీవించే వ్యక్తుల కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. పచ్చి పనసకాయని ఎండబెట్టి అందులోని గింజలను పొడిగా మారుస్తారు.



మధుమేహం ఉన్నవారు, ప్రీడయాబెటిస్ బారిన పడినవారు ఈ పనస పిండిని వాడితే మంచిది.



బియ్యం పిండిని వాడే స్థానంలో 50 శాతం ఈ పనస పిండిని ఉపయోగించడం వల్ల అందరికీ ఆరోగ్యకరమే.



ఇది దీర్ఘకాలంలో రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి.