నూనె కల్తీదో, కాదో ఇలా తెలుసుకోండి



ఆహార పదార్థాలను కల్తీ చేయడం అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇదే ప్రధాన సమస్యగా మారింది.



కల్తీ కంటికి కనిపించదు. దీనివల్ల ఆహారాన్ని తింటే దీర్ఘకాలంలో అనేక రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.



ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహారాల్లోని కల్తీని ఎలా తెలుసుకోవాలో చెబుతోంది.



కల్తీ అయిన నూనె రంగు, వాసన, రుచి భిన్నంగా ఉంటాయి. అయితే వాటిని కనిపెట్టడం మాత్రం కష్టమే.



ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఒక మిల్లీలీటరు ఆయిల్‌ను వేయండి. దానిలో నాలుగు మిల్లీలీటర్ల డిజిటల్ వాటర్ కలపండి.



టెస్ట్ ట్యూబ్‌ని బాగా కదిలించండి. దానికి రెండు మిల్లీలీటర్ల గాఢమైన HCL ను జోడించండి.



కల్తీ లేని నూనె అయితే ట్యూబు పై పొర పై ఎలాంటి రంగు మార్పు కనిపించదు. కల్తీ అయినదైతే నూనె పై పొరలో ఎరుపు రంగు వస్తుంది.



కల్తీ నూనెల ధరలు తక్కువ ఉంటాయి. అందుకే హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బజ్జీల కొట్లు వారు ఇలా కల్తీ నూనెనె కొంటారు.