ఒత్తిడి వల్ల బరువు పెరిగిపోతారు జాగ్రత్త



ఒత్తిడి శరీరంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.



ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా తింటూ ఉంటారు. దాని వల్ల బరువు పెరిగిపోతారు.



కార్టిసాల్ అనేది అధిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరం విడుదల చేసే హార్మోన్. ఇది విడుదల అయినప్పుడు ఆకలిని ప్రేరేపిస్తుంది.



ఒత్తిడి సమయంలో ఇష్టమైన ఆహారాలు తినాలనే ఆసక్తి చూపిస్తారు. అందుకే కార్టిసాల్ తగ్గించుకునే మార్గాలు ప్రయత్నించాలి.



గొడవలు, ఆందోళన పెంచే వ్యక్తులకు దూరంగా ఉండాలి. వారితో ఉండటం వల్ల ఒత్తిడి, ఆలోచనలు పెరిగిపోతాయి.



దీని వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా బరువు పెరిగిపోతారు.



ఒత్తిడి తగ్గించుకునేందుకు మనసుకి హాయినిచ్చే సంగీతం వింటూ మనసు, ఆలోచనలు డైవర్ట్ చేసుకోవచ్చు.



మైండ్ కి ప్రశాంతంగా ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు గడిపినా కూడా ఒత్తిడి తగ్గిపోతుంది.