మలేరియా వ్యాక్సిన్ వచ్చేసింది



ఏటా ఐదు లక్షల మంది పిల్లలు కేవలం మలేరియా కారణంగానే ఆఫ్రికాలో మరణిస్తున్నారు.



మన దేశంలో ఏటా మలేరియా జ్వరం బారిన పడి ఇరవై వేల మంది మరణిస్తున్నారు.



మలేరియా వల్ల కలిగే మరణాలను తగ్గించేందుకు మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకొచ్చారు.



R21 అని పిలిచే ఈ వ్యాక్సిన్‌ను ఆఫ్రికన్ దేశాలు ఆమోదించాయి.



ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికాలోని 12 దేశాలకు రాబోయే రెండేళ్ల కాలంలో 18 మిలియన్ డోసులను అందిస్తుంది.



మనకు ఇంతవరకు మలేరియా వ్యాక్సిన్ అందుబాటులో లేదు.



ఆఫ్రికా వారు అనుమతించిన R21 వ్యాక్సిన్ ఇంకా మన దేశంలో ఆమోదించలేదు.



త్వరలో ఈ వ్యాక్సిన్‌ను మనదేశంలో కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.