నిద్రపోయేటప్పుడు లైట్లు ఎందుకు ఆపాలి?



రాత్రి నిద్ర పోయేటప్పుడు కాంతి ఉండాలా వద్దా అనే విషయం తెలుసుకుందాం.



ఆరోగ్య నిపుణులు చెబుతున్న అభిప్రాయం ప్రకారం శరీరానికి తగినంత విశ్రాంతి, మెదడుకు ప్రశాంతత దొరకాలంటే చీకటి వాతావరణంలోనే నిద్రపోవాలి.



రాత్రిపూట కాంతికి గురి కావడం వల్ల శరీరంలోని సహజంగా పనిచేసే సిర్కాడియన్ రిథమ్ పనితీరులో మార్పు రావచ్చు.



లైట్లు వేసుకొని నిద్ర పోవడం వల్ల ఫ్రాగ్మెంటేడ్ నిద్ర వస్తుంది. అంటే ఈ నిద్ర సరైనది కాదు. నిద్ర నాణ్యత తగ్గుతుంది.



చివరికి డిమ్‌గా ఉండే లైట్లు కూడా నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. నిద్ర తక్కువగా పడుతుంది. ప్రశాంతంగా అనిపించదు.



కాబట్టి పూర్తి చీకటిలో పడుకుంటేనే ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పడుతుందని చెబుతున్నారు నిపుణులు.



రాత్రిపూట శరీరం కాంతికి గురి కావడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



మీ మెదడు కూడా నిద్ర సమయాన్ని సరిగా అంచనా వేయలేదు. నిద్రలేమి లక్షణాలు తీవ్రంగా మారిపోతాయి.