నేరేడు పండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.



జామున్ లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.



పేగు కదలికలు నియంత్రించి మలబద్ధకం సమస్యని నివారిస్తుంది



కొలెస్ట్రాల్ స్థాయిలని అదుపులో ఉంచుతుంది.



మధుమేహులు తినగలిగే అద్భుతమైన పండు. కానీ దీన్ని అతిగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి.



జామున్ ఎక్కువగా తీసుకుంటే మొటిమలు వచ్చేలా చేస్తుంది.



రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యత ఏర్పడేలా చేస్తుంది. తలనొప్పి, అలసట, చిరాకు, దాహం పెరగడానికి దారి తీస్తుంది.



నేరేడు పండ్లు అతిగా తింటే మలబద్ధకం సమస్య వచ్చేలా చేస్తుంది. జీర్ణవ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది.



నేరేడు పండ్లు అతిగా తింటే స్వరపేటిక వాపు, ఊపిరితిత్తుల్లో వాపూ వంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి.