మద్యం ముందు కచ్చితంగా ఆహారం తినాలా?



మద్యం చేసే చెడు గురించి తెలిసినా కూడా రోజూ ఆల్కహాల్ తాగే వారి సంఖ్య అధికంగానే ఉంది.



ఆల్కహాల్ తాగడానికి ముందే పోషకాహారాన్ని తినమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.



ఆల్కహాల్ తాగాక అది పొట్టలోకి చేరి చిన్న పేగు ద్వారా మీ రక్తంలోకి ప్రవేశిస్తుంది. పొట్ట ఖాళీగా ఉంటే ఆల్కహాల్ మీ రక్తంలోకి నేరుగా వెళ్లి కలిసిపోతుంది.



ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.



అందుకే ఈ పానీయం తాగడానికి ముందు ఏవైనా పోషకాహారాన్ని తినడం చాలా మంచిది.



పొట్టలో ఉన్న ఆహారంలోని నీటి కంటెంట్ మీరు తాగిన మద్యాన్ని పలచగా మారుస్తుంది.



ఆల్కహాల్ తాగేసరికే పొట్టలో ఆహారం ఉంటే, అందులోని ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్ వంటివి మద్యాన్ని శరీరం శోషించుకోవడం నెమ్మదించేలా చేస్తాయి.



దీనివల్ల ఆల్కహాల్ రక్తంలో ఎక్కువగా కలిసే అవకాశం ఉండదు.



ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరంలో ఆల్కహాల్ వల్ల క్షీణించే విటమిన్లను, ఖనిజాలను తిరిగి అందిస్తుంది.