పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడితే కాలేయానికి ముప్పు



వెన్ను నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ముందుగా వేసుకునేది పెయిన్ కిల్లర్స్‌నే.



పెయిన్ కిల్లర్స్‌ను ఇలా అధికంగా వాడడం అనేది మంచి పద్ధతి కాదు.



ఎక్కువ కాలం పాటూ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల తీవ్రమైన కాలేయ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.



కాలేయానికి గాయం కావడం, పొట్టలో పుండ్లు ఏర్పడడం, గ్యాస్ట్రిక్, అల్సర్లు రావడం, మూత్రపిండాలు తీవ్రంగా నష్టపోవడం వంటి సమస్యలు వస్తాయి.



ఈ మందులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం పాటు తీసుకుంటే మూత్రపిండాలు శాశ్వతంగా నష్టపోవచ్చు.



మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నట్లయితే మీకు సాధారణం కంటే చాలా తక్కువ మొత్తంలో మూత్రాన్ని ఉత్పత్తి చేస్తారు.



పెయిన్ కిల్లర్లను రోజూ వేసుకోకూడదు. తరచూ వేసుకుంటే మీకు తెలియకుండానే ఆరోగ్యాన్ని నష్టపోతారు.