మద్యం తాగడం మానేస్తే జరిగేది ఇదే కొంతమందికి మద్యం రోజూ ఉండాల్సిందే. ప్రతిరోజూ రాత్రి మద్యం తాగాకే నిద్రపోయే వారి సంఖ్య ఎక్కువ. అలాంటివారు ఒక నెల రోజులు పాటు పూర్తిగా మద్యం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? కాలేయం పరిస్థితులను తట్టుకోగల అవయవం. మద్యం మానేస్తే మళ్లీ దానిలో సానుకూల మార్పులు వస్తాయి. ఒక నెలపాటు మద్యం మానేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి. మద్యాన్ని మానేశారో, మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు ఏవి రావు. ఆల్కహాల్ అనేది కార్సినోజెన్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే క్యాన్సర్ కారకంగా ఇది పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఆల్కహాల్ సంబంధిత క్యాన్సర్ ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువే. నెల రోజులు పాటు మద్యాన్ని మానేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి.