నూరేళ్ళు పండుగ చేసుకుని ప్రపంచ రికార్డులు సృష్టించే వృద్ధుల
దీర్ఘాయువు రహస్యం ఏంటో పరిశోధకులు తెలుసుకున్నారు.


11 ఆహార నియమాలు పాటించడం వల్లే శతాధికులు ఎక్కువ రోజులు జీవించగలుగుతున్నారు.



ఆహారంలో సుమారు 95 నుంచి వంద శాతం వరకు వాళ్ళు తీసుకునే పదార్థాలు మొక్కల ఆధారితమైనవి.



దీర్ఘాయువులు మాత్రం మాంసం ఎప్పుడో ఒకసారి మాత్రమే తింటారు.
మాంసానికి బదులుగా వాళ్ళు టోఫుని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.


సార్డినెస్ వంటి చిన్న చవకైన చేపలు తినేందుకు ఎంచుకుంటారు.
ఇవి పాదరసం, ఇతర రసాయనాలకి తక్కువ గురి అవుతాయి.


డైరీ ఉత్పత్తులకి దూరంగా ఉంటారు.
ఒకవేళ తీసుకోవాల్సి వస్తే మేక, గొర్రె పాల ఉత్పత్తులు ఎంచుకుంటారు.


ఎక్కువ కాలం జీవించడానికి గుడ్లు తినాల్సిన అవసరం లేదని అంటారు.
ఒకవేళ తినాల్సి వస్తే వారానికి మూడు కంటే ఎక్కువ తీసుకోరు.


కాయధాన్యాలు వంటి బీన్స్ ఆహారంలో ఉండేలా చూసుకుంటారు.
బ్లాక్ బీన్స్, చిక్ పీస్, వైట్ బీన్స్ తీసుకుంటారు.


ప్రాసెస్ చేసిన బ్రెడ్ కి చాలా దూరంగా ఉంటారు. తృణధాన్యాలతో చేసిన వాటిని ఎంచుకుంటారు.



షుగర్ ఫ్రీ, తక్కువ కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడానికి ఇష్టపడరు.



ఫిజీ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. రోజుకి కనీసం ఏడు గ్లాసుల నీటిని తాగుతారు.
Images Credit: Pexels