మధుమేహ బాధితులకు ఏవైనా పుండ్లు లేదా గాయాలు అయితే అంత త్వరగా తగ్గిపోవు.
అందుకు కారణం ఏంటో తెలుసా?


షుగర్ లెవల్స్ అదుపులో ఉండకపోతే గాయాలు నయం కావని అందరూ చెప్తూ ఉంటారు.



కానీ అలా ఎందుకు జరుగుతుందో పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు విశ్లేషించారు.



మధుమేహం ఉన్నవారిలో బలహీనమైన ఎక్సోసోమ్‌లు ఉన్నాయి.
ఇది వాపుకి కారణమవుతుంది. గాయం మానడాన్ని నెమ్మదిస్తుంది.


ఎక్సోసోమ్‌లు కణాల మధ్య సంకేతాలను పంపించే నానోపార్టికల్స్



బలహీనమైన ఎక్సోసోమ్ లు గాయాన్ని త్వరగా నయం చేసే విధంగా సంకేతాలు పంపించలేవు.



పిట్స్ బర్గ్ పరిశోధకులు 22 మంది మధుమేహం ఉన్న వారిని 15 మంది డయాబెటిస్ లేని వారి
గాయాల నమూనాని పరిశీలించారు.


గాయాలు నయం చేసేందుకు సహకరించే మాక్రోఫేజ్ రోగనిరోధక కణాల నుంచి వస్తాయి.



ఎక్సోసోమ్ సరిగా సంకేతాలు పంపించినప్పుడే ఈ మాక్రోఫేజ్ లు సరిగా పని చేసి గాయాలని
నయం చేస్తాయి.


అవి బలహీనంగా ఉండటం వల్ల గాయం త్వరగా తగ్గిపోకుండా ఉంటుందట.
Images Credit: Pixabay/ Pexels