ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఇదే

అన్నింటికన్నా ఖరీదైన కూరగాయ ‘హాప్ షూట్స్’. ఇవి తినాలంటే వేల రూపాయలు ఖర్చుపెట్టాలి.

హాఫ్ షూట్స్ కిలో ధర 85,000 రూపాయలు.

ఇవి జనపనార కుటుంబానికి చెందిన మొక్కలు.ఈ పంట చేతికి రావాలంటే మూడేళ్లు పడుతుంది.

హాప్ షూట్‌లకు పూసే పువ్వును బీర్ తయారీలో వాడతారు. దీనిలో విటమిన్లు E, B6, Cలతో నిండి ఉంటుంది.

అపారమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు అధికం.

ఈ కూరగాయలో క్షయవ్యాధికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరోధకాలను సృష్టించే శక్తి ఉంది.

నిద్రలేమి, టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, యాంగ్జయిటీ వంటి అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో హాప్ షూట్స్ ఉపయోగపడతాయి.

హాప్ షూట్స్ పువ్వులను ఎండబెట్టి ఆ పొడిని ఔషధాలలో ఉపయోగిస్తారు.