ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం ఇదే



అలంకార ఆభరణాల్లో భాగమైపోయింది వజ్రం. చిన్న ముత్యమంత వజ్రం కూడా లక్షల్లో పలుకుతుంది.

ప్రపంచంలోనే అది పెద్ద వజ్రం ఏదో తెలుసా? ఎనిగ్మా. ఇదొక పెద్ద నల్లటి వజ్రం.

ఇన్నాళ్లు ఈ వజ్రం లండన్లోని వేలం సంస్థ ఆధీనంలో ఉండేది. ఇటీవలే ఈ వజ్రాన్ని అమ్మేందుకు వేలం పాట నిర్వహించారు.

ఒక అజ్ఞాతవ్యక్తి ఈ నల్ల వజ్రాన్ని 32 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు.

రెండు వందల 60 ఏళ్ల క్రితం ఒక ఉల్క లేదా గ్రహశకలం భూమిని తాకినప్పుడు ఈ వజ్రం ముక్క భూమిపై పడిందని నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు.

555.55 క్యారెట్లు, 55 కట్స్ కలిగిన డైమండ్ ఇది.

దీన్ని ‘కాస్మిక్ వండర్’గా పేర్కొన్నారు వేలం సంస్థ అధికారులు.