అంజనాద్రి పైనే ఆంజనేయుడు పుట్టాడు, ఆధారాలివిగో



వైకుంఠనాధుడు కొలువైయున్న ఏడుకొండలను బుషులు, మహర్షులు ఎన్నో పేర్లతో కీర్తించారు.కృతయుగంలో వృషభాద్రిగా, త్రేతాయుగంలో అంజనాద్రిగా, ద్వాపర యుగంలో శేషాద్రిగా, కలియుగంలో వేంకటాద్రిగా కీర్తించారు.



శ్రీవారికి పరమ భక్తులైన అన్నమాచార్యులు, పురందర దాసు,వెంగమాంబ కూడా అంజనాద్రి పర్వతం గురించి కీర్తనల్లో ప్రస్తావించారు.



అంజనాద్రే హనుమంతుడి‌ జన్మస్ధలంగా శ్రీ వేంకటాచల మహత్యంలో పేర్కొన్నారు. ఇదే అంశాన్ని పద్మ,స్కంద బ్రహ్మాండ పురాణంలో ఉందంటున్నారు.



శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి శ్రీలంకకు ప్రయాణించిన మార్గాన్ని వైజ్ఞానికంగా ఆక్షాంశాలు, రేఖాంశాలతో తిరుమల హనుమ జన్మస్ధలంగా రుజువు అవుతున్నాయని భౌగోళిక నిపుణులు అంటున్నారు.



హోమాలు,క్రతువుల్లో చతుర్ణామాలలతో అర్చన చేస్తారని, త్రేతాయుగంలో తిరుమల ఆంజనేయ స్వామి వారి జన్మస్ధలంగా ప్రసిద్దికెక్కిందని పురాణాలు చెప్తున్నాయి.



ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావైసేవలో పఠించే శ్రీనివాస గద్యం, ఆలవట్ట కైంకర్యంలో అంజనాద్రి ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు



అంజనాద్రిలో అంజనాదేవి తపస్సు చేసి హనుమంతునికి జన్మనిచ్చిందని అందువల్లే ఈ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందని వెంకటాచల మహత్యం పేర్కోన్నారు