ప్రేమను వ్యక్తపరచడానికి చకోర పక్షిలా ఎదురుచూసే ఒంటరి జీవితాల కోసం ఏడాదికోసారి వస్తుంది ‘వాలెంటైన్స్ డే’.
ప్రేమతో నిండిన ఈ సందేశాలను పంపిస్తే ఎవరైనా ఇట్టే పడిపోతారు.
నేను ప్రాణంతో ఉన్నాను..అది అందరికీ తెలుసు కానీ... నా ప్రాణం నీ దగ్గర ఉంది అని నీకు తప్ప ఎవరికీ తెలియదు
నువ్వు నా నవ్వు- నువ్వు నా కోపం నువ్వు నా ఆస్తి - నువ్వు నా స్వార్థం నువ్వు నా ఆశ - నువ్వు నా భయం నువ్వు నా ధైర్యం - నువ్వు నా నీడ నువ్వు నా తోడు - నువ్వే నా ప్రపంచం
నా నిన్నటి కలా రేపటి ఆశ నేటి శ్వాస అన్నీ నువ్వే
నిన్న మొన్నటి వరకూ నాచుట్టూ ఉన్నావు వెనుకకు చూస్తే గుప్పెళ్ల కొద్దీ జ్ఞాపకాలు పరిచేసి పోయావు నువ్వు మళ్లీ తిరొగొస్తావని ఆశపడుతున్నా...
ప్రేమను పంచే నీ హృదయాన్ని నా జన్మజన్మలకు కానుకగా ఇస్తావా?
నీపై ఉన్న ప్రేమను చెప్పాలంటే ఒక్క క్షణం చాలు.. చూపించాలంటే ఈ జన్మ చాలదు
నేను ఎక్కువ సంతోషంగా ఉండేది ఎప్పుడో తెలుసా? నువ్వు నా పక్కన ఉన్నప్పుడే.
నా ఊహల్లో నువ్వు నా ఆనందంలో నువ్వు నా గుండెల్లో నువ్వు నేను అనే పదానికి అర్థానివే నువ్వు