సల్మాన్ ఖాన్ ఎన్నో ఏళ్ల నుంచి పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్య ఒకటుంది.
దాని పేరు ట్రైజెమినల్ న్యురాల్జియా అనే నరాల సమస్య.
ఈ సమస్య ఉన్న వారిలో ముఖ భాగం చాలా నొప్పిని కలిగిస్తుంది.
కొన్ని నిమిషాల పాటూ కరెంట్ షాక్ కొట్టినంత నొప్పిని కలిగించి పోతుంది. బ్రష్ చేయడం, మేకప్ వేసుకోవడం వంటి చిన్న చిన్న సమస్యలు కూడా విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి.
అలా అని 24 గంటలు ఈ నొప్పి ఉండదు. వస్తూ పోతూ వేధిస్తుంది. యాభైఏళ్లు దాటిన వారిలోనే అధికంగా ఈ సమస్య కనిపిస్తుంది.
ముఖంలో ఉండే ట్రైజెమినరల్ నరాల పనితీరు దెబ్బతిన్నప్పుడు ఇలా సమస్య వస్తుంది.
దీనికి చికిత్స తీసుకోకపోతే నొప్పి తీవ్రంగా మారుతుంది.
పరిస్థితి తీవ్రంగా ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది.
ఎవరికైనా ముఖ భాగంలో తరచూ నొప్పి వస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.