టీ బ్యాగులను ఇలా కనిపెట్టారు టీ ప్రేమికులకు టీ బ్యాగులకు ఉన్న బంధం ఇంతా అంతా కాదు, కనిపిస్తే చాలు వేడి నీళ్లలో టీ బ్యాగు పడాల్సిందే. టీ బ్యాగులు వాడకం మొదలైంది 1900 సంవత్సరం ప్రారంభంలో. వాటిని అదే సంవత్సరం న్యూయార్క్ నగరంలో కనుగొన్నారు. థామస్ సుల్లివన్ అనే వ్యక్తి ఒక టీ వ్యాపారి కొడుకు. అతను తన తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నాడు. కొంచెం టీ పొడిని చిన్న పట్టు పౌచుల్లో వేసి, ప్యాక్ చేసి వినియోగదారులకు రుచి చూడమని పంపించాడు. ఆ పౌచులను అందుకున్న వినియోగదారులు వాటిని ఎలా వాడాలో తెలియక కప్పు వేడి నీటిలో ఆ పౌచ్ ని వేశారు. చక్కగా టీ తయారైపోయింది. దీంతో ఆయనకు మరిన్ని అలాంటి టీ పౌచులు కావాలంటూ ఆర్డర్లు వచ్చాయి. దీంతో థామస్ తొలిసారిగా టీ బ్యాగులను విక్రయించడం ప్రారంభించాడు. అది అతి పెద్ద వ్యాపారంగా మారిపోయింది. టీ బ్యాగులపై పేటెంట్ ఇద్దరు మహిళలు పొందారు. కష్టపడిన థామస్ మాత్రం చరిత్రలో మిగిలి పోయాడు.