ఉదయం ఆత్రంగా పనులు చేసుకునే బదులు వాటిలోని కొన్ని పనులు పడుకునే ముందే పూర్తి చేసుకుంటే మంచిది.

పడుకునే ముందు ఫోన్ చూడటం కంటే మంచి పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి. ఇది మనసుకి విశ్రాంతినిస్తుంది.

ధ్యానం చేయాలి

పడుకునే ముందు మనసు రిలాక్స్ చేసుకోవడానికి కొద్ది సేపు ధ్యానం చేయడం మంచిది.

నిద్రకి వెళ్ళడానికి రెండు గంటల ముందు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే శరీరం, మైండ్ రిలాక్స్ మూడ్ లోకి వెళతాయి.

తేలికపాటి భోజనం ఎంచుకోవాలి

నిద్రపోవడానికి తినడానికి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండాలి. తేలికపాటి ఆహారం తీసుకుంటే పొట్టకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఫోన్స్ పక్కన పెట్టేయాలి. స్క్రీన్ ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి.

కళ్ళకి మాస్క్ పెట్టకపోవడమే మంచిది. ఇది కళ్ళని వెచ్చగా ఉంచుతాయి కానీ కంటికి ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటాయి.