రుచికి బంగాళాదుంప, కనిపించడంలో ముల్లంగి, బీట్ రూట్ లా కనిపిస్తుంది టర్నిప్ కూరగాయ. కాల్షియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. తెలుపు, ఊదారంగుల్లో ఇది లభిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పెద్ద పేగులో ఒత్తడి, వాపుని తగ్గిస్తుంది. టర్నిప్ లో రక్తనాళాలని ఆరోగ్యంగా ఉంచే డైటరీ నైట్రేట్ లు పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. టర్నిప్ లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలని నియంత్రిస్తుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. టర్నిప్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్ కి వ్యతిరేకంగా పని చేసే సమ్మేళనాలున్నాయ్. అధిక మొత్తంలో ఫైబర్, తక్కువ కేలరీలు కలిగి ఉండటం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. బరువు తగ్గిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులని అడ్డుకుంటుంది. చిరుతిండిగా కూడ తినొచ్చు. టర్నిప్ ముక్కలు కాల్చి ఉప్పు, మిరియాల పొడి నిమ్మరసం జోడించుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. Image Credit: Pixabay/ Pexels