మసాలా నెయ్యి గురించి తెలుసా? మామూలు నెయ్యి అందరికీ తెలుసు, కానీ మసాలా నెయ్యి చాలా స్పెషల్. ఒక గిన్నెలో కారం, కుంకుమపువ్వు రేఖలు, సోంపు పొడి, యాలకుల పొడి, పసుపు, నెయ్యి వేసి బాగా కలపాలి. అదే మసాలా నెయ్యి. ఈ మసాలా నెయ్యిని చపాతీలపై రుద్దుకొని తింటే ఆ రుచే వేరు. అలాగే గోరువెచ్చని పాలలో దీన్ని కలుపుకొని తాగినా ఎంతో మంచిది. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్లు A, D, E, K పుష్కలంగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో వాడిన మసాలా దినుసులు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ నెయ్యి ఎంతో మేలు చేస్తుంది. కీళ్ళకు లూబ్రికేషన్ అందిస్తుంది. మసాలా నెయ్యిలో గుండెకు అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆహారంలో మసాలా నెయ్యిని తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది.