ప్రపంచంలోనే అత్యంత మంచు నగరం ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం యాకుట్స్. ఇక్కడ ఫ్రిడ్జ్‌ల అవసరం ఉండదు. ఇది రష్యాలోని మాస్కోకు తూర్పు వైపుగా 5000 కిలోమీటర్ల దూరంలో ఉంది. శీతాకాలంలో ఈ నగరంలోని ఉష్ణోగ్రతలు మైనస్ 40 నుంచి మైనస్ 50 వరకు పడిపోతాయి. మనుషుల కనురెప్పలు కూడా గడ్డకట్టుకుపోతాయి. తినే తిండి నిమిషాల్లో మంచులా మారిపోతుంది. మార్కెట్ల నిండా మంచు పేరుకుపోతుంది. అప్పుడే వలవేసి తెచ్చిన చేపలు కూడా ఈ మంచుకి... గట్టిగా గడ్డల్లా మారిపోతాయి. ప్రజలు డ్రెస్సుల మీద డ్రెస్సులు వేసుకొని క్యాబేజీల్లా కనిపిస్తారు. అలా డ్రెస్సింగ్ చేసుకోకపోతే వారు ఆ చల్లదనానికి గడ్డకట్టుకుపోతారు. ఈ నగరంలో 336,274 మంది నివసిస్తున్నారు. అక్కడ అధిక ఉష్ణోగ్రత అంటే 18 డిగ్రీల ఫారెన్ హీట్ మాత్రమే. అంతకుమించి అక్కడ ఎప్పుడూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవలేదు.