మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు చూసేందుకు అసహ్యంగా కనిపిస్తాయి. ఆ సమస్య నుంచి బయట పడేందుకు ఈ వంటింటి చిట్కాలు ట్రై చెయ్యండి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన తేనె మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఆపిల్ సిడర్ వెనిగర్ చర్మ సమస్యలకి మంచి ఔషధంగా పని చేస్తుంది. మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. విటమిన్ సి కలిగిన నిమ్మకాయ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. చనిపోయిన మృతకణాలని తొలగిస్తుంది. మొటిమలు, వాపుని తగ్గించడంలో వేగవంతంగా పని చేసే అద్భుతమైన మార్గాల్లో ఇది ఒకటి. గ్రీన్ టీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లని కలిగి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తుంది. మొటిమలకి చికిత్స చేసి చర్మాన్ని మృదువుగా చేసే గుణాలు వేపలో పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా జెల్ మొటిమలు రాకుండా చేస్తుంది. చర్మం చికాకు లేకుండా హైడ్రేట్ గా ఉండేలా చేస్తుంది. పసుపు చర్మ సౌందర్యానికి అద్భుతమైన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పదార్థం.