గొంతు నొప్పి, జలుబు, దగ్గు సమస్యలు తగ్గాలంటే వేడి నీళ్ళలో ఉప్పు వేసి పుక్కిలించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గొంతు నొప్పి, దగ్గు సమస్యలకు చెంచా నెయ్యిని వేడి చేసి, 2 లవంగాలు వేసి గోరు వెచ్చగా తాగండి. తులసి ఆకుల టీ లేదా ఆకులను తింటే జలుబు, జ్వరం, ముక్కు దిబ్బడ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కప్పు నీళ్ళలో అల్లం ముక్కను మరిగించి దాంట్లో చెంచా తేనె కలిపి తాగితే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ముక్కు దిబ్బడ, ఛాతిలో రద్దిగా ఉన్నప్పుడు ఆవిరి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. చలికాలంలో జలుబు, సైనస్ సమస్యలు ఉన్నపుడు వేడి నీటితో స్నానం చేయడం శ్రేయస్కరం. Image Credit: Pexel, Pixabay, Unsplash