సింపుల్ గా దొరికే పదార్థాలతో చేసే ఈ హెయిర్ మాస్క్ ట్రై చేసి చూడండి.
జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.


హెయిర్ మాస్క్ కి కావాల్సిన పదార్థాలు
అరటి పండు
తేనె
ఆలివ్ ఆయిల్
గుడ్లు


పండిన అరటి పండు తీసుకుని దాన్ని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి.
అందులో 1-2 టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి.


ఒకటి లేదా రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, గుడ్లు జోడించుకోవాలి. ఈ ఆయిల్ జుట్టుకి కండిషన్ ఇస్తుంది.



ఈ హెయిర్ మాస్క్ వేసుకునే ముందు జుట్టు పొడిగా ఉంచుకోవాలి. జుట్టు చిక్కు లేకుండా బాగా తీసుకోవాలి.



మాస్క్ ని రూట్ నుంచి చివర వరకు చక్కగా అప్లై చేసుకోవాలి.
మాస్క్ అప్లై చేసిన తర్వాత జుట్టుకి క్యాప్ వేసి కవర్ చేసుకోవాలి.


30 నిమిషాల నుంచి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత జుట్టుని గోరువెచ్చని నీటితో బాగా కడగాలి.



జుట్టుకి మరింత మెరుపు అందించాలని అనుకుంటే చివరిగా చల్లని నీటితో మరొకసారి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.



అరటిపండు జుట్టుని ధృడంగా ఉంచేందుకు సహాయపడుతుంది. జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది.



తేనె జుట్టులో తేమని నిలపడంలో మెరుగ్గా పని చేస్తుంది.
జుట్టు పొడిబారిపోకుండా పెళుసుగా మారకుండా చూస్తుంది.


ఆలివ్ ఆయిల్ జుట్టు, తలకి సరైన పోషణ అందిస్తాయి.
గుడ్డు వెంట్రుకల కుదుళ్ళని బలోపేతం చేస్తాయి.