ఈ మట్టిని తింటారు తెలుసా?



సప్తవర్ణాల దీవి... ఆ దీవిలో కనిపించని రంగు లేదు.



ఈ దీవి పేరు హెర్ముజ్ ఐలాండ్.ఇరాన్ దేశానికి 8 కి.మీ దూరంలో పర్షియన్ గల్ఫ్ సముద్రానికి మధ్యలో ఉంటుంది.



ఇదెంత ప్రత్యేకమంటే దాదాపు 70కి పైగా ఖనిజాలు కేవలం ఈ ఒక్క దీవిలోనే గుర్తించారు పరిశోధకులు.



ఇక్కడ దొరికే ఎర్రమట్టి చాలా ప్రత్యేకమైనది. దీన్ని గెలాక్ అంటారు.

స్థానికులు వంటకాల్లో ఈ మట్టిని మసాలా రూపంలో వాడతారు.

దీంతో సూరఖ్ అనే సాస్ ని తయారు చేస్తారు. ఆ సాస్‌ని బ్రెడ్ తో తింటారు.



బ్యూటీ ఉత్పత్తుల్లో కూడా ఈ మట్టిని వాడుతారు. అందుకే అక్కడ ఎంతో మంది జీవనోపాధి ఈ మట్టే.



అక్కడ సముద్ర తీరంలో వచ్చే అలలు కూడా కూడా ఎర్రరంగు పులుముకుంటాయి.



ఇక్కడికి వచ్చిన పర్యాటకులు రాళ్లు, మట్టి,ఉప్పు పెళ్లలు అన్నీ ఏరుకుని తీసుకువెళతారు.