మే చివరి వారంలో థియేటర్, ఓటీటీల్లో విడుదల కాబోయే సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! ఎఫ్3: వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమాను మే 27న విడుదల చేయనున్నారు. టాప్ గన్: 1986లో వచ్చిన 'టాప్ గన్' సినిమాకి సీక్వెల్ గా 'టాప్ గన్: మావెరిక్' అనే సినిమా రాబోతుంది. మే 27న రిలీజ్ రానుంది. అశోకవనంలో అర్జున కళ్యాణం: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా మే 27 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. కన్మణి రాంబో ఖతీజా: ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎటాక్: జాన్ అబ్రహం నటించిన ఈ సినిమా జీ5 యాప్ లో మే 27 నుంచి ప్రసారం కానుంది. మే 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో 'స్ట్రేంజర్స్ థింగ్స్' సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. ఒబీ వ్యాన్ కెనోబీ అనే వెబ్ సిరీస్ మే 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రానుంది. నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాపసీ అనే హిందీ సిరీస్ మే 27 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది.