విమానంలో ప్రయాణించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. అవేమిటో తెలుసుకుందాం.

ఎత్తులో వాయువులు 30 శాతం వరకు వ్యాకోచిస్తాయి. కనుక విమాన ప్రయాణంలో సోడా బదులు నీళ్లుతాడమే మంచిది.

విమానంలో ఇచ్చే దుప్పట్లు దిండ్లు ఉపయోగించకపోవడమే మంచిది . వీటి ద్వారా అలర్జీలు వ్యాపించవచ్చు.

డీప్ వీన్ థ్రాంబోసిస్ వంటి సమస్యలు రావచ్చు. కనుక దూరప్రయాణాల్లో కాసేపు లేచి నడవడం, స్ట్రెచ్ చెయ్యడం అవసరం.

వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

విమానంలో కాంటాక్ట్ లెన్స్ ధరించవద్దు. అవి కళ్లకు చికాకు కలిగించవచ్చు

విమానంలో గాలి వల్ల చర్మం పొడిబారే ప్రమాదం ఉంటుంది. కనుక సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ తప్పక వినియోగించాలి.

వీలైనంత వరకు విమానం గోడకు ఆనుకొని నిద్ర పోకుండా ఉండేందకు ప్రయత్నించండి.

సీటు పైన ఉండే పర్సనల్ అడ్జస్టబుల్ ఎయిర్ మీడియంలో సెట్ చేసి ఉంచుకోవాలి. పూర్తిగా ఆఫ్ చెయ్యవద్దు.

బాత్రూమ్ లో ఫ్లష్ బటన్ వాడేందుకు పేపర్ టవల్ వాడడం మంచిది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

సీల్ చేసిన కంటైనర్ నుంచి మాత్రమే నీళ్లు లేదా ఏదైనా పానియం ఎంచుకోవాలి.

విమానం టేకాఫ్ అయ్యే వరకు నిద్రపోకుండా ఉండడం మంచిది. లేదంటే తలనొప్పి రావచ్చు .
Representational Image : Pexels