డెంగ్యూ వచ్చిందంటే ఫస్ట్ కనిపించేవి ఈ లక్షణాలే!

పెరుగుతోన్న డెంగ్యూ కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ డెంగ్యూ లక్షణాలను ముందుగానే తెలుసుకోవాలి.

డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ సోకిన తర్వాత నాలుగు నుంచి ఆరు రోజులకి బయటపడతాయి.

డ్యెంగ్యూ వచ్చినవారికి ముందుగా హై ఫీవర్ వస్తుంది.

జ్వరంతోపాటు తలనొప్పి, జాయింట్ పెయిన్స్ వస్తాయి.

కొందరికి వాంతులు, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఆ సమయంలో మీకు తెలియకుండానే ప్లేట్ లెట్ కౌంట్స్ తగ్గిపోతాయి.

ఆరోగ్యకరమైన మనిషిలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య 1.5 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది.

ప్లేట్‌లెట్‌ల సంఖ్య 20 వేలు లేదా అంతకన్నా తగ్గినప్పుడు ప్రాణాలకే ప్రమాదం.

వెంటనే చికిత్స పొందకపోతే చనిపోయే అవకాశం కూడా ఉంది.

Images Credit: Pexels