బంగారు అమృతంగా పిలవబడే తేనె అంటే చిన్న
పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తీసుకుంటారు.


నేరుగా తేనె పట్టు నుంచి తీసిన తేనెకి దుకాణాల్లో అమ్మే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.



ప్రపంచవ్యాప్తంగా కల్తీ ఆహార ఉత్పత్తుల్లో తేనె కూడా ఒకటిగా నిలిచింది.
పంచదార సిరప్ లో రంగు కలిపి తేనె అంటూ అమ్మేస్తున్నారు.


మీరు కొనుగోలు చేసింది స్వచ్చమైన తేనె లేదంటే కల్తీదా అని తెలుసుకునేందుకు
ఇలా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు.


చాలా మంది బ్రెడ్ రోస్ట్ చేసుకుని దాని మీద తేనె వేసుకుని కూడా తీసుకుంటారు.



ఈ బ్రెడ్ తో తేనె ఒరిజనలా నకిలీదా అనేది తెలుసుకోవచ్చు.
బ్రెడ్ ముక్క తీసుకుని అందులో కొన్ని చుక్కల తేనె వేసి కాసేపు అలాగే ఉంచాలి.


బ్రెడ్ తేనెని పీల్చుకుంటే కల్తీది. తేనె పీల్చుకోకుండా ఉంటే మీరు కొనుగోలు చేసిన తేనె నిజమైనది.



ఒక టిష్యూ మీద కొన్ని చుక్కల తేనె వేసి కాసేపు అలాగే ఉంచాలి.
పేపర్ తేనెని గ్రహిస్తే అది కల్తీది, అలా కాకుండా టిష్యూ మీద అలాగే ఉంటే స్వచ్చమైనదని అర్థం.


అగ్గిపెట్ట తీసుకుని తేనెలో నానబెట్టాలి. తర్వాత దాన్ని వెలిగించేందుకు ప్రయత్నించండి.



అగ్గిపుల్ల కాలితే తేనె కల్తీ కాదు. అదే అగ్గిపెట్టె వెలగడానికి కొంత
సమయం తీసుకుంటే అందులో నీరు కలిసిందని అర్థం.