ఆలస్యంగా నిద్రపోతే ఎంత నష్టమో తెలుసా? ఆధునిక జీవితంలో లేట్ నైట్ స్లీపింగ్ అనేది భాగం అయిపోయింది. లేట్ నైట్ నిద్రపోయే అలవాటు ఉన్నవారు ఎన్నో రోగాలను ఆహ్వానిస్తున్నట్టే లెక్క. లేట్ నైట్ నిద్రపోయే అలవాటు ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 19 శాతం అధికంగా ఉన్నట్టు కొత్త అధ్యయనం చెబుతుంది. లేట్ నైట్ నిద్రపోయేవారు నాణ్యమైన నిద్రను పొందరు. వారి నిద్ర చాలా మగతగా ఉంటుంది. దీని వల్ల శరీరం మొత్తం నీరసపడిపోతుంది. ఆహారం లేకుండా జీవించడం ఎంత కష్టమో నిద్ర లేకుండా జీవించడం అంతకన్నా కష్టం. ప్రతి మనిషికి నిద్ర అత్యవసరం. రోజు ఎనిమిది గంటల పాటు రాత్రి నిద్ర ఉండాలి. మెదడుకు విశ్రాంతిని ఇచ్చేది నిద్ర మాత్రమే. మీ మెదడు చక్కగా పనిచేస్తేనే మీ శరీరం మొత్తం చక్కగా పనిచేస్తుంది. మతిమరుపు, డిప్రెషన్, చిరాకు వంటివి రాకుండా ఉండాలంటే చక్కగా నిద్రపోవాలి.