నాన్ స్టిక్ పాన్ వచ్చిన తర్వాత ఇనుము కళాయి వాడకం చాలా మంది తగ్గించేశారు.



ఇనుము పాత్రల్లో వంట చేసుకుని తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు కూడా పెరుగుతాయని మీకు తెలుసా?



ఆహారం ఇనుము పాత్రల్లో చేసినప్పుడు పాత్ర నుంచి కొంత ఇనుము గ్రహిస్తుంది.



ఇనుప కడాయిలో వంట చేయడం వల్ల ఆహారం ఐరన్ తో సమృద్ధిగా ఉంటుంది.
మన శరీరానికి ఐరన్ చాలా కీలకమైన పోషకం


చర్మం, జుట్టు, మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఐరన్ లోపం వల్ల మైకం, అలసట, స్లీప్ అప్నియా మరికొన్ని సమస్యలు వస్తాయి.


ఐరన్ పాత్రల్లో ఆమ్ల పదార్థాలు వండకూడదు.
నిమ్మ, వెనిగర్ వంటి పదార్థాలు ఉన్న వాటిని వండితో వంట రుచి చెడిపోతుంది.


వంట చేసిన తర్వాత ఆహారాన్ని ఇనుము పాన్ మీద ఉంచకూదడు.
దాన్ని ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఆహార నాణ్యత చెడిపోతుంది.


ఐరన్ తవా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వాటిని తోముకునేటప్పుడు హార్డ్ గా ఉండే స్క్రబ్ ఉపయోగించకూడదు.



అందుకే వాటిని తోమడానికి ముందు దానిపై కాస్త ఉప్పు, బేకింగ్ సోడా వేసి రుద్ది ఆ తర్వాత శుభ్రంగా కడగడం మంచిది.
రుద్ది ఆ తర్వాత శుభ్రంగా కడగడం మంచిది.
Images Credit: Pixabay/Pexels