తీపి ఇష్టం లేని వారు నిజానికి చాలా తక్కువమంది ఉంటారు. మరి ఆ తీపిని ఇచ్చే చక్కెర గురించి ఈ వాస్తవాలు మీకు తెలుసా?

చక్కెర కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అణువుల కలయికతో ఏర్పడుతుంది.

గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్ అనేవి చక్కెరకు సరళమైన రూపాలు.

మనం ఎక్కువగా వినియోగించే టెబుల్ షుగర్ క్రిస్టలైజ్డ్ సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ మాలిక్యూల్ మిశ్రమం.

2 వేల సంవత్సరాలకు పూర్వమే భారత దేశం ప్రపంచంలో మొదటి సారిగా క్రిస్టలైజ్డ్ షుగర్ తయారు చేశారు.

9వ శతాబ్ధంలో చక్కెరను ఔషధంగా ఉపయోగించేవారు. కంటి సమస్యల చికిత్సకు కంట్లో చక్కెర పొయ్యడం చేసేవారట.

మొదట్లో చక్కెర అరుదుగా దొరికే ఖరిదైన వస్తువు. కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేది.

1850ల నాటికి చక్కెర చాలా విరివిగా లభించడం మొదలైంది. సామాన్యులు కూడా చక్కెర వినియోగించడం మొదలుపెట్టారు.

ఆండ్రియస్ మార్గ్ గ్రాఫ్ అనే శాస్త్రవేత్త 1747లో షుగర్ బీట్‌ను కనుగొన్న తర్వాత చక్కెర చవకయ్యింది.

కానీ మనం ఇప్పటికీ చక్కెర తయారీకి చెరకునే ఎక్కువగా ఉపయోగిస్తాము. యూరప్, అమెరికాల్లో షుగర్ బీట్ పంట ఎక్కువ.

చక్కెర చాలా తీవ్రమైన వ్యసనమట. దీన్ని పూర్తిగా మానెయ్యాలని అనుకుంటే తలతిరగడం, నొప్పి, ఫ్లూవంటి విత్ డ్రావల్ లక్షణాలు కనిపిస్తాయట.

శరీరంలో గ్రెలిన్ హార్మోన్ లో జన్యు మార్పులు ఉన్నవారు చక్కెర ఎక్కువ వినయోగిస్తారట.

చాలా కాలం పాటు చక్కెరను ప్రిజర్వేటివ్ గా ఉపయోగించారు.

చక్కెర వల్ల ఆస్మోసిస్ అనే ప్రక్రియ ద్వారా డీహైడ్రేషన్ ప్రక్రియ జరిగి బ్యాక్టీరియా నశిస్తుంది.
Representational Image : Pexels