రాళ్లు నడవడం ఏమిటీ? పిచ్చా అని అనుకుంటున్నారా?

అయితే, మీరు కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి వెళ్లాల్సిందే.

అక్కడ పూర్తిగా ఎండిపోయిన ఓ సరస్సులో రాళ్లు వాటికవే కదులుతాయి.

ప్రాణంలేని రాళ్లు ఎలా కదులుతాయనే ప్రశ్నలు చాలామందిలో నెలకున్నాయి.

రాళ్లు ఎలా కదులుతున్నాయో తెలుసుకోడానికి పరిశోధనలు కూడా జరిగాయి.

319 కిలోల బరువున్న ఓ రాయి ఎవరి ప్రమేయం ఎలా కదులుతున్నాయో తెలియక అంతా జుట్టు పీక్కున్నారు.

2011లో స్క్రిప్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఓసియానో‌గ్రఫీ పరిశోధకులు ఈ మిస్టరీని చేధించారు.

అంతే బరువుండే 15 రాళ్లను తెచ్చి వాటిపై నిఘా పెట్టారు. రెండేళ్ల పరిశోధన తర్వాత అసలు సంగతి తెలిసింది.

చలికాలంలో అక్కడ కురిసే వర్షం.. రాత్రివేళల్లో మంచులా మారుతుంది.

ఉదయం ఎండ వచ్చిన తర్వాత దాని కింద ఉండే మంచు రాతిని ముందుకు కదుల్చుతుంది.

మంచు వల్ల సెకను కొన్ని ఇంచుల దూరం చొప్పున రాళ్లు ముందుకు కదిలాయని తేల్చేశారు.

Images Credit: Pixabay and Pixels