వేసవిలో ఎండలు దంచేస్తున్నాయ్. ఈ వేడిలో మీరు ఏది పడితే అది తినకూడదు.

వేసవిలో మాత్రమే తినేందుకు కొన్ని ప్రత్యేక ఆహారాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి మరి.

పుచ్చకాయ: ఇందులో 91.45 శాతం నీరే ఉంటుంది. ఇది శరీరానికి నీరు, యాంటీ ఆక్సైడులు ఇస్తుంది.

కీర దోసకాయ: ఇందులో బోలెడంత ఫైబర్ ఉంటుంది. వేసవిలో కీర దోసకాయ తింటే అనారోగ్యం దరిచేరదు.

నిమ్మ రసం: వేసవిలో నిమ్మ రసం తాగడం అస్సలు మరిచిపోకండి. ఇది మీకు బోలెడంత శక్తి ఇస్తుంది.

పెరుగు: వేసవిలో తప్పకుండా పెరుగు లేదా మజ్జిగా తీసుకోవాలి. ఇది శరీరాన్ని ఎల్లప్పుడు చల్లగా ఉంచుతుంది.

కొబ్బరి నీళ్లు: ఇందులో విటమిన్లు, మినరల్స్ తదితర పోషకాలు ఉంటాయి. వేడిలో మీ శరీరానికి శక్తినిచ్చే ఔషదం ఇది.

పుదీనా: వేసవిలో పుదీనా తినడం లేదా నీటిలో కలుపుకొని తాగడం ఆరోగ్యానికి చాలామంచిది.

ఉల్లిపాయలు: ఇది శరీరానికి చలవ చేస్తుంది. వడ దెబ్బ నుంచి రక్షిస్తుంది. దీన్ని పచ్చిగా తింటే బెటర్.

కర్బూజాలు: ఇందులోనూ బోలెడంత నీరు ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎప్పుడూ డీహైడ్రేడ్ కాకుండా చూస్తుంది.

Images And Videos Credit: Pixels and Pixabay