బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.



స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ ఖట్టర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది అనన్య.



ఇషాన్‌ తల్లి నీలిమా సైతం అనన్య తమ ఫ్యామిలీలో ఒక మెంబర్‌ అంటూ చెప్పింది.



తన కొడుకు జీవితంలో అనన్యకు ఎంతో ప్రాధాన్యముందంటూ తెలిపింది. 



కానీ ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని టాక్. 



మూడేళ్లుగా డేటింగ్‌ లో ఉన్న అనన్య, ఇషాన్‌ బ్రేకప్‌ చెప్పుకున్నట్లు సమాచారం.



ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వీరి ప్రేమకు ముగింపు పలికినట్లు తెలుస్తోంది.



పార్టీలు, ట్రిప్ లకు కలిసి వెళ్తూ హడావిడి చేసిన ఈ జంట ఇప్పుడు వేరైనట్లు చెబుతున్నారు. 



మరి దీనిపై ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి!