తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు 1. ప్రభవ - ప్రభవించునది ( పుట్టుక) 2. విభవ - వైభవంగా ఉండేది 3. శుక్ల -తెల్లనిది, నిర్మలమైనది, ఆనందానికి ప్రతీక 4. ప్రమోదూత - ఆనందం, ప్రమోదభరితంగా ఉండేది 5. ప్రజోత్పత్తి - రజ ఆంటే సంతానం- సంతాన వృద్ధి కలిగినదే ప్రజోత్పత్తి 6. అంగీరస -అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు 7. శ్రీముఖ - శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదని అర్ధం 8. భావ - భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ భావనారయణుడు 9. యువ - యువ అంటే బలానికి ప్రతీక 10. ధాత - బ్రహ్మ, ధరించేవాడు, రక్షించేవాడు